D Educt: Aug 22: హైదరాబాద్‌లో 181 అంగన్వాడీ టీచర్‌ పోస్టులు.. నేటితో దరఖాస్తుల గడువు ముగింపు

హైదరాబాద్‌ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో 181 అంగన్వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్‌ గడువు నేటితో ముగియనుంది.

చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఆగస్టు 22న తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తమకు సంబంధించిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలను పరిశీలించి గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana