
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
సభ ప్రారంభం సందర్భంగా సభ్యులు ‘వందేమాతరం’ గీతాన్ని పూర్తి 6 చరణాలతో ఆలపించారు. అయితే ‘వందేమాతరం’లో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని AICC, CWC నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు పూర్తి ఆరు చరణాలను ఆలపించడం చర్చనీయాంశంగా మారింది.
