D Spiritual: Dec 4: సూర్యాస్తమయం:
మన ఎండాకాలంలో సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాం. మండే ఎండలతో స్వాంతన కోసం సాయంత్రం ఎప్పుడు అవుతుందా, చల్లగాలిలో డాబాలపై పడుకుందామా అని ఆలోచిస్తుంటాం. పగలంతా ఎలాగొలా సర్దుకుపోతాం. కానీ ఆదేశాల్లో అలా కుదరదు. ఎందుకంటే అక్కడ మనలాగా సూర్యుడు అస్తమించడు. అసలు ఈ భూమ్మీద సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలు కొన్ని ఉన్నాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా? అర్ధ‌రాత్రి అయినా కూడా అక్క‌డ ప‌ట్ట‌ప‌గల్లాగానే ఉంటుంది. ఇవి ఇండియాలో కాదులేండి. మరెక్కడ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే ఈ దేశాల గురించి తెలుసుకోవాల్సిందే. నిరంతరం సూర్యుడు అందుబాటులో ఉండే ప్రాంతాలేవో ఇప్పుడు చూద్దాం.

నార్వే:
ఏడాదిలో చాలా కాలం పాటు నార్వేలో సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌లు లాగా ఎండ ఉంటుంది. అందుకే నార్వే దేశాన్ని “Land Of Midnight Sun” అని పిలుస్తారు. అక్షాంశానికి ఎక్కువ ఎత్తులో ఉండ‌టంతో అక్కడ కొద్దిరోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి జూలై మధ్యలో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే మబ్బుల చాటుకు వెళతాడట. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు అస్తమించకుండా కనిపిస్తూనే ఉంటాడు.

ఫిన్లాండ్:
అందమైన సరస్సులు, ద్వీపాలకు ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్‌లోనూ సూర్యుడు చాలా రోజుల పాటు అస్తమించడు. వేసవిలో దాదాపు 70 రోజుల పాటు అర్ధరాత్రి కూడా పగలులా వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో మాత్రం సూర్యుడి జాడే కనిపించదు.

ఐస్‌లాండ్:
యూరప్‌లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐస్‌లాండ్. ఇక్కడ నివాస ప్రాంతాలు తక్కువైనా, పర్యాటకంగా మంచి ఆదరణ ఉంది. జూన్ నెలలో ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఆ నెలలో పగలు–రాత్రి అనే తేడా అస్సలు ఉండదు. అందుకే జూన్‌లో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. అదనంగా ఐస్‌లాండ్‌లో దోమలు కూడా ఉండవు.

కెనడా:
కెనడాలోని యుకోన్ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే వేసవిలో దాదాపు 50 రోజులు అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ సమయంలో వారు పలు పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జూలై మధ్యలో జరిగే గ్రేట్ నార్తరన్ ఫెస్టివల్ కూడా ఇందులో భాగమే. చలికాలంలో మాత్రం నునావట్ ప్రాంతంలో 30 రోజుల పాటు సూర్యుడు కనబడదు.

స్వీడన్:
స్వీడన్‌లోని కిరునా నగరంలో ఏడాదిలో దాదాపు 100 రోజుల పాటు సూర్యుడు అస్తమించడే లేదు. మే నుండి ఆగస్టు మధ్య వరకు ఎప్పుడూ వెలుతురు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. అదనంగా కిరునా ఆర్ట్ నోయువే చర్చి కూడా అక్కడి ప్రధాన ఆకర్షణ.

అలాస్కా:
అమెరికాకు చెందిన అలాస్కాలోని బారోలో మే నుండి జూలై వరకు సూర్యుడు అస్తమించడే లేదు. అర్ధరాత్రి కూడా సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది. కానీ నవంబర్‌లో మాత్రం 30 రోజులు వరుసగా చీకటి ఉంటుంది. దీనినే పోలార్ నైట్ అని అంటారు.

కానాక్, గ్రీన్‌లాండ్:
గ్రీన్‌లాండ్‌లో ఉన్న కానాక్ నగరం — చలికాలంలో పూర్తిగా చీకటిలోనే ఉంటుంది. అయితే వేసవిలో ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యవరకు సూర్యుడు రోజంతా కనిపిస్తూనే ఉంటాడు. ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో సూర్యుడు నిరంతరంగా ఉదయిస్తూనే ఉంటాడు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana