Suhas’ Mandadi Clears Censor with U/A Certificate.. Grand Release Tomorrow!

D News: టాలీవుడ్ నటుడు సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మండాడి’ విడుదలకు సిద్ధమైంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కిన బోట్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, ఎస్.ఆర్. కథిర్ కెమెరా పనితనం సినిమాకు మరింత బలంగా నిలవనున్నాయని యూనిట్ తెలిపింది. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు కూడా హైలైట్‌గా ఉంటాయని పేర్కొంది.

ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ‘మండాడి’కి అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ మంచి స్పందన కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తోంది.

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా సుహాస్, సూరి కెరీర్‌లో ఎలాంటి ఓపెనింగ్‌ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana