
D News: బిగ్‌బాస్ ఇంట్లో ‘మహాపరీక్ష’ టాస్క్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ను బ్లూ, రెడ్ టీమ్‌లుగా విభజించారు. బ్లూ టీమ్‌కు రాంప్రసాద్, రెడ్ టీమ్‌కు రోహిత్ నాయకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ గేమ్‌లో భాగంగా రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్ జోన్‌లో ఉంచాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ఈ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఈ వారం ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
బ్లూ టీమ్ నుంచి ఎలాంటి చర్చ లేకుండానే రాంప్రసాద్ స్వయంగా హైరిస్క్‌లోకి వెళ్లేందుకు ముందుకొచ్చాడు. తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాననే విషయాన్ని శనివారం చెబుతానని చెప్పడంతో ఆసక్తి నెలకొంది. దీంతో బ్లూ టీమ్ తరఫున రాంప్రసాద్ పేరును నరేశ్ ఖరారు చేశాడు.
మరోవైపు రెడ్ టీమ్ నుంచి ఆర్జే చరణ్‌ను హైరిస్క్‌లో పెట్టాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే మొదట రోహిత్ హైరిస్క్‌లోకి వెళ్లాడని త్రిగుణ్ టీమ్ సభ్యులతో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ డేంజర్ జోన్‌లోకి వెళ్లాడు.
దీంతో ప్రస్తుతం రాంప్రసాద్, చరణ్ ఇద్దరూ ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారు. అయితే వీరి దగ్గర ఉన్న ప్రత్యేకమైన కీస్‌ను సరైన సమయంలో ఉపయోగించగలిగితే ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో కొనసాగుతారు? ఎవరి జర్నీకి ఈ వారంతో ముగింపు పడుతుంది? అనేది ఆసక్తిగా మారింది.
