D Spiritual: Dec 30: ఇంట్లో పూజను సాధారణంగా ఇంటి యజమాని చేయాలని పెద్దలు చెబుతారు. ఇంటి యజమాని ఎవరో ఆయనే పూజ చేయడం వల్ల ఆ పుణ్యఫలితం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అందుతుందని విశ్వాసం. ఎలాగైతే కుటుంబంలో ఒక ప్రధాన వ్యక్తి సంపాదిస్తే అందరూ ఆ ఫలితాన్ని అనుభవిస్తారో, అలాగే ఇంటి యజమాని చేసే పూజ వల్ల ఇంటి శుభక్షేమం కలుగుతుంది.

అలాగని మహిళలు పూజ చేయకూడదనే అర్థం మాత్రం కాదు. మహిళలు కూడా పూజలు, వ్రతాలు, నోములు చేయవచ్చు. వాస్తవానికి మగవారి అవసరం లేకుండా మహిళలే ప్రత్యేకంగా చేసే వ్రతాలు, యజ్ఞాలు అనేకం ఉన్నాయి. అయితే గృహ పూజ విషయంలో ఇంటి యజమాని పూజ చేస్తే ఆ పుణ్యఫలం భార్యకు, తన సంతానానికి, ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరికీ, తల్లిదండ్రులకు కూడా సంపూర్ణంగా లభిస్తుందని శాస్త్రపరమైన నమ్మకం ఉంది.

మహిళలు పూజ చేస్తే ఆ పూజ ఫలితం ప్రధానంగా ఆ మహిళకే పరిమితం అవుతుందని సంప్రదాయం చెబుతుంది. అందుకే ఇంటి యజమాని పూజ చేయడం ఉత్తమమని అన్నారు తప్ప, మహిళలు పూజ చేస్తే పాపం వస్తుందనే భావన ఎక్కడా లేదు. ఇది కేవలం ఫలిత విస్తృతి గురించిన ఆచారం మాత్రమే.

సాధారణంగా “భర్తలో భార్య సగభాగం” అని చెబుతారు కానీ “భార్యలో భర్త సగభాగం” అని ఎవరూ చెప్పరు. అలాగే పూజా ఫలితాల విషయంలో కూడా ఇంటి యజమాని పూజ చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుందని, కుటుంబమంతటికి దక్కుతుందని భావిస్తారు. మహిళలు పూజ చేస్తే అది ఆ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఫలితానికే పరిమితం అవుతుందని సంప్రదాయం చెబుతోంది.

మహిళల దినచర్యను గమనిస్తే, ఉదయం లేవగానే స్నానం చేసి దీపం పెట్టడం, తులసికోటకు పూజ చేయడం అనేది ప్రధాన నియమంగా ఉంటుంది. తులసికోట పూజను ప్రత్యేకంగా మహిళల ధర్మంగా పరిగణిస్తారు. పూర్వకాలం నుంచి కూడా మహిళలు తులసికోట వద్ద పూజ చేయడం, పురుషులు పూజగదిలోని దేవతలను ఆరాధించడం అనే పద్ధతి కొనసాగుతోంది.

ఇంటి పూజగదిలో దీపం పెట్టడం, ప్రధాన పూజలు చేయడం ఇంటి యజమాని బాధ్యతగా భావిస్తారు. మహిళలకు ఉన్న నియమం ఏమిటంటే ఉదయం తప్పనిసరిగా తులసికోట వద్ద పూజ చేసి దీపం వెలిగించడం, అనంతరం ఇంటి పనులు నిర్వహించడం. అలాగే భర్త పూజ చేయడానికి అవసరమైన పూలు, దీపారాధన సామగ్రి సమకూర్చడం కూడా భార్య చేసే ముఖ్యమైన ధర్మంగా పరిగణిస్తారు.

ఈ విధంగా భర్త చేసే పూజలో భార్య కూడా తన వంతు బాధ్యతను నిర్వహించినట్టే అవుతుంది. అందువల్ల భర్త పూజ చేసినంత పుణ్యఫలం భార్యకూ సమానంగా లభిస్తుంది. అందుకే ఇంటి యజమాని పూజను పూర్తి చేస్తే ఆ ఫలితం కుటుంబమంతటికి దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana