
DET:DEC 31
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రీలీల:
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ నటి శ్రీలీల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.
ఒక్కసారిగా చుట్టుముట్టిన అభిమానులు:
శ్రీలీల ఆలయం వెలుపలికి రాగానే ఆమెను చూసిన భక్తులు మరియు అభిమానులు ఒక్కసారిగా ఆమె వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటిని దగ్గర నుండి చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీ పడటంతో అక్కడ కాసేపు సందడి నెలకొంది.భక్తుల తాకిడి పెరగడంతో శ్రీలీల కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది.
రక్షణగా నిలిచిన భద్రతా సిబ్బంది:
అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడటంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు.తోపులాట జరగకుండా జాగ్రత్త పడుతూ ఆమె చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి సురక్షితంగా కారు వరకు తీసుకువెళ్లారు.అంత రద్దీలోనూ శ్రీలీల చిరునవ్వు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేయడం అందరినీ ఆకట్టుకుంది.
భక్తులతో పోటెత్తిన తిరుమల:
వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమల కొండ భక్తుల కోలాహలంతో నిండిపోయింది.సాధారణ భక్తులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.శ్రీలీలతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ పవిత్ర రోజున శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
