
DSports 17Mar 2026:తిరువనంతపురం: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్‌కు మారిన సంజు శాంసన్, ఈ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. మంగళవారం కేరళలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా తనను పెంచి పెద్ద చేసిన రాజస్థాన్ ఫ్రాంఛైజీని వీడటం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.
- సమయం ముగిసింది: “రాజస్థాన్ రాయల్స్ జట్టులో నా ప్రయాణం ముగిసిందని నాకు అనిపించింది. అక్కడ నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చాను. అందుకే కొత్త సవాళ్లు స్వీకరించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను” అని సంజు పేర్కొన్నారు.
- ధోనీతో కలిసి ఆడాలనే కోరిక: ఎంఎస్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ప్రతి భారతీయుడి కల అని, ఆయన పక్కన కూర్చుని క్రికెట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే సీఎస్కేను ఎంచుకున్నట్లు వివరించారు.
- చెన్నై ఫ్యాన్స్ మద్దతు: టీ20 ప్రపంచకప్ 2026 సమయంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ప్రేక్షకులు తనకు అందించిన అపారమైన మద్దతు తనను ఆశ్చర్యపరిచిందని, వారిని నిరాశపరచకుండా ఆడతానని భరోసా ఇచ్చారు.
