
DSports 17Mar 2026:కాబూల్/హైదరాబాద్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఘోర కలివిల్లి జరిగింది. సోమవారం రాత్రి (మార్చి 16, 2026) కాబూల్‌లోని ‘ఒమిద్ డ్రగ్ రిహాబిలిటేషన్’ (మత్తు పదార్థాల విముక్తి కేంద్రం) ఆసుపత్రిపై జరిగిన వైమానిక దాడుల్లో సుమారు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు పాకిస్థాన్ కారణమని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపించగా, పాకిస్థాన్ మాత్రం వీటిని ఖండించింది.
- రాత్రి 9 గంటల సమయంలో 2000 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిసింది. భవనం అధిక భాగం ధ్వంసమై మంటల్లో చిక్కుకుంది మరణించిన వారిలో ఎక్కువ మంది చికిత్స పొందుతున్న రోగులేనని సమాచారం. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దారుణం జరగడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యం చేసుకున్నామని, ఆసుపత్రిపై దాడి చేయలేదని పాకిస్థాన్ సమాచార శాఖ స్పష్టం చేసింది.
- గత కొన్ని వారాలుగా అఫ్గానిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తాజా దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB) కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.
