D News: Jul 30: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. చల్లబడిన వాతావరణం: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఆకస్మికంగా వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, జేఎన్‌టీయూ, బాచుపల్లి, నిజాంపేట్ పరిసరాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, మూసాపేట్ మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. కార్యాలయాల రద్దీ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరిద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. అలాగే వాహనదారులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం కోరింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana