DET:DEC 13:
రాత్ అకేలీ హై ది బన్సల్ మర్డర్స్ నటీనటుల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ:
క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్న చిత్రం రాత్ అకేలీ హై ది బన్సల్ మర్డర్స్ నటీనటులు తాజాగా IANSకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సినిమాలోని వారి పాత్రలు,కథాంశం యొక్క ప్రత్యేకత,మరియు వారి నటనా ప్రయాణం గురించి వివరంగా పంచుకున్నారు.ఈ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్ధిఖీ,చిత్రాంగద సింగ్,సంజయ్ కపూర్ మరియు దర్శకుడు హనీ ట్రెహాన్ ముఖ్యమైన విషయాలు తెలిపారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ మౌనంగా ఉండే శక్తి:
మొదటి భాగంలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ జటిల్ యాదవ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మళ్లీ నటించారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ జటిల్ యాదవ్ పాత్ర నేను ఇంతకు ముందు చేసిన పాత్రలకు చాలా భిన్నమైనది.ఈ పాత్ర కోసం దర్శకుడు హనీ ట్రెహాన్ గారు నాకు టోన్,పేస్,డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా స్పష్టంగా వివరించారు అని అన్నారు. ఈ పాత్రలో అతిగా భావాలను ప్రదర్శించడం ఉండదు,అంతా లోపలే దాచుకోవాలి.కేవలం మౌనంగా ఉండే శక్తిని చూపించాలి. అది చాలా కష్టమైనది,అందుకే ఆసక్తికరంగా అనిపించింది అని నవాజ్ తెలిపారు.జటిల్ పాత్ర మారినప్పటికీ,సత్యాన్ని తెలుసుకోవాలనే అతని నిబద్ధత చెక్కుచెదరదని,ఎలాంటి ఒత్తిడి వచ్చినా దర్యాప్తులో రాజీ పడడని వివరించారు.

చిత్రాంగద సింగ్ లోపల భయంతో ఉండే పాత్ర:

నటి చిత్రాంగద సింగ్ ఈ సినిమాలో మీరా అనే క్లిష్టమైన పాత్ర పోషించారు.తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ,మీరా బయటకు ప్రశాంతంగా,ధైర్యంగా కనిపిస్తుంది,కానీ లోపల మాత్రం తీవ్ర భయం మరియు ఆందోళనతో జీవిస్తూ ఉంటుంది.ఆమెది చాలా లేయర్లు ఉన్న పాత్ర ఒకేసారి బలహీనంగా,బలంగా కనిపిస్తుంది అని అన్నారు.ఆమెలో చెప్పని నిజాలు చాలా ఉన్నాయి.ఇంత సంక్లిష్టమైన పాత్రను ఆఫర్ చేసినందుకు హనీ గారికి,నెట్‌ఫ్లిక్స్‌కి నేను చాలా కృతజ్ఞురాలిని అని తెలిపారు.ఈ కథ సామాజిక సమస్యలను ప్రస్తావిస్తుందా అన్న ప్రశ్నకు,ఈ సినిమా ఏ ఒక్క సంఘటన ఆధారంగా తీసింది కాదు.మన సమాజంలో ఉన్న జీవితాలు,పోరాటాలు,పరిస్థితుల నుండి ప్రేరణ పొంది తీసిన కథ ఇది” అని వివరించారు.

సంజయ్ కపూర్ దర్శకుడి విజన్ చాలా ముఖ్యం:
నటుడు సంజయ్ కపూర్ తమ షూటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ,చిత్రీకరణ సమయంలో మేము ఎవరూ మానిటర్ చూసే అవసరం రాలేదు.దర్శకుడు హనీ ట్రెహాన్ గారికి సంపూర్ణ స్పష్టత ఉంది.ఏ షాట్ ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు అని చెప్పారు.సినిమా అనేది నిజంగా దర్శకుడి మీడియం.నటీనటులు వారి ప్రతిభను తీసుకొస్తారు,కానీ మొత్తం సినిమాను,ప్రతి చిన్న వివరాలను చూసేది దర్శకుడే అని ఆయన అభిప్రాయపడ్డారు.