DET:DEC 16:
ఆరోమాలే చిత్రం ప్రేమకథా నేపథ్యం:
ఆరోమాలే అనేది తమిళంలో రూపొందిన ఒక రొమాంటిక్ కామెడీ సినిమా.ఇందులో కిషన్ దాస్ హీరోగా,మన టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గారి కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటించారు.ఈ సినిమాకు సారంగ్ త్యాగు దర్శకత్వం వహించారు. నవంబర్ 7,2025 న థియేటర్లలో విడుదలై,ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది.ఈ చిత్రం ప్రధానంగా ప్రేమ చుట్టూ అందులో ఉండే అద్భుతం మరియు వాస్తవికత మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది.

ఓటీటీ విడుదల తేదీ:
థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత ఆరోమాలే సినిమా డిసెంబర్ 12,2025 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.ఎక్కడ చూడవచ్చు? ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన జియో సినిమా-హాట్‌స్టార్లో చూడవచ్చు.ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా,తెలుగు,మలయాళం,కన్నడ,హిందీ భాషలతో కలిపి మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన భాషలో ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.జియో హాట్‌స్టార్‌లో సినిమా చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉండాలి.