
DET:DEC 13:
ధురందర్ రణవీర్ సింగ్ కెరీర్లో మరో బంపర్ హిట్:
రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.ఈ ఏడాది బాలీవుడ్లో విడుదలైన చిత్రాల్లో అత్యంత వేగంగా కలెక్షన్లు రాబడుతున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమాకు మొదటి నుంచీ ప్రేక్షకులు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.
భారీ వసూళ్లు మూడు రోజుల్లోనే సెంచరీ!
ధురందర్ చిత్రం విడుదలైన తొలి మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది.ఇది రణవీర్ సింగ్ కెరీర్లో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా నిలిచింది.ముఖ్యంగా వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్లలో భారీ జంప్ కనిపించింది.పాజిటివ్ టాక్,యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల జోరు:
ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాదు,ఓవర్సీస్ మార్కెట్లో కూడా అద్భుతంగా రాణించింది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ధురందర్ విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు దాటి దూసుకుపోతోంది.ఈ భారీ వసూళ్లతో ఇది 2025లో విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన వాటిలో ఒకటిగా నిలిచే దిశగా ప్రయాణం చేస్తోంది.ఈ సినిమా సుమారు రూ.280 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినట్టు తెలుస్తోంది.
ప్రేక్షకుల అండ సినిమాకు అసలు బలం:
ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆడియెన్స్ ఇచ్చిన మద్దతే అని చెప్పాలి.రణవీర్ సింగ్ నటన, దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్,కథనం ప్రేక్షకులను కట్టిపడేశాయి.ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా,సంజయ్ దత్,ఆర్.మాధవన్ వంటి అగ్ర నటులు కూడా కీలక పాత్రలు పోషించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది.
