
DSports:Sep23: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 12లో బెంగళూరు బుల్స్ జట్టు గుజరాత్ జెయింట్స్ పై గెలుపొందింది. సెప్టెంబర్ 22, 2025న జరిగిన ఈ ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 28-24 తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ యోగేష్ అద్భుతమైన డిఫెన్స్ (6 టాకిల్ పాయింట్లు) మరియు రైడర్ ఆకాష్ షిండే (7 రైడింగ్ పాయింట్లు) కీలక పాత్ర పోషించారు. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ తమ పటిష్టమైన డిఫెన్స్ తో గుజరాత్ చివరి నిమిషంలో పుంజుకోవడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టి విజయాన్ని సొంతం చేసుకుంది.
