
D News: ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘418’ ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది.
భయపెట్టేందుకు ‘A’ సర్టిఫికెట్..
చాలా రోజులుగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమైంది. సినిమాలోని భయానక సన్నివేశాలు, హర్రర్ అంశాల కారణంగా ‘A’ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హర్రర్ సినిమాలను చూసి నవ్వుకున్నది చాలు.. ఇక భయపడే సమయం వచ్చిందంటూ మేకర్స్ చెబుతున్నారు.
సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సంచలన అంశాలతో తెరకెక్కిన ఈ హర్రర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
