
DSports Jan6 2026::ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడా మైదానానికి పాకాయి. 2026 టీ20 ప్రపంచ కప్ నిర్వహణ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు భారత్‌కు వచ్చేది లేదని, తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చాలని ఐసీసీని కోరింది.
- మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్ నుంచి తమ ఆటగాడిని తొలగించడాన్ని అవమానంగా భావిస్తూ, బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ 2026 ప్రసారాలను నిలిపివేయాలని అక్కడి సమాచార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. “బంగ్లాదేశ్ క్రికెట్‌ను గౌరవించని చోట మా ఆటగాళ్లు ఉండరు” అని ఆ దేశ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు.
- ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పాకిస్థాన్ జట్టు ఇప్పటికే తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే దారిలో వెళ్తే, టోర్నమెంట్ షెడ్యూల్ మొత్తం మారే అవకాశం ఉంది. ఐసీసీ చైర్మన్ జై షా ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
