
DSports Jan6 2026:న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించేలా సాగుతున్న ‘మార్ఫింగ్’ ఉదంతాలపై భారత స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత ఫొటోలను అనుమతి లేకుండా ఎడిట్ చేయడం లేదా మార్ఫింగ్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘గ్రోక్’ (Grok) కు నేరుగా విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ సాయంతో నెటిజన్లు సెలబ్రిటీల ఫొటోలను వింతగా ఎడిట్ చేయడం, డ్రెస్ కలర్స్ మార్చడం లేదా అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీకా రావల్ ఫొటోలు కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని గుర్తించిన ఆమె, ముందస్తుగా సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు.
