
మస్కట్‌లో చిక్కుకుపోయిన తనను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ధన్యవాదాలు తెలిపిన బాధితురాలు
హైదరాబాద్, కొడంగల్/దౌల్తాబాద్, నవంబరు 3: మస్కట్‌లో చిక్కుకుపోయిన తనను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించినందుకు బాధితురాలు తుప్పుడు లక్ష్మి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తన ధన్యవాదాలు తెలియజేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మి ఉపాధి కోసం గత ఫిబ్రవరిలో మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆమెకు ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించారు. అంతేకాకుండా, యజమాని (కఫీల్) ఆమె పాస్‌పోర్టును తన వద్దే ఉంచుకుని స్వదేశానికి తిరిగి పంపించేందుకు నిరాకరించారు. దీంతో లక్ష్మి మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో కేటీఆర్ సహకారంతో ఆమె సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తనకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
