
DSports 12Feb 2026:అహ్మదాబాద్/కోల్‌కతా: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ పోరులో బెంగాల్ స్టార్ పేసర్ ముకేష్ కుమార్ తన పదునైన బౌలింగ్‌తో ఆంధ్ర జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. బుధవారం జరిగిన ఆటలో ముకేష్ ఒకే స్పెల్‌లో కీలక వికెట్లు పడగొట్టి బెంగాల్ జట్టుకు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. ముఖ్యంగా ఆంధ్ర కీలక బ్యాటర్లను స్వల్ప విరామాల్లో పెవిలియన్ పంపి ‘డబుల్ ధమాకా’ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
- ఆంధ్ర ఇన్నింగ్స్ నిలకడగా సాగుతున్న సమయంలో ముకేష్ కుమార్ రంగంలోకి దిగి మ్యాజిక్ చేశారు.క్రీజులో పాతుకుపోయిన శ్రీకర్ భరత్ (47), నితీష్ కుమార్ రెడ్డి (33)లను తన అద్భుతమైన స్పెల్‌తో ముకేష్ బోల్తా కొట్టించారు. 18 ఓవర్ల పాటు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముకేష్, కేవలం 50 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఒకవైపు బ్యాటర్లు భారీ స్కోర్ల వైపు వెళ్తుంటే, ముకేష్ తన అనుభవంతో వికెట్లు తీసి మ్యాచ్‌ను బెంగాల్ వైపు తిప్పారు.
