
DSports 12Feb 2026:కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-‘బి’ పోరులో కంగారూలు 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. పేసర్ నాథన్ ఎల్లిస్, స్పిన్నర్ ఆడమ్ జంపా తమ పదునైన బౌలింగ్‌తో ఐరిష్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చేశారు.
- టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.మార్కస్ స్టోయినిస్ (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, జోష్ ఇంగ్లిస్ (37), మ్యాట్ రెన్షా (37) అతనికి చక్కని సహకారం అందించారు.ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశాడు.
- 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. నాథన్ ఎల్లిస్ తన తొలి స్పెల్‌లోనే మూడు వికెట్లు తీసి ఐర్లాండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఎల్లిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మధ్య ఓవర్లలో ఆడమ్ జంపా తన స్పిన్ మ్యాజిక్‌తో మిగతా పని పూర్తి చేశాడు. 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.వీరిద్దరి ధాటికి ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జార్జ్ డాక్రెల్ (41) మినహా ఎవరూ పోరాడలేకపోయారు.
