DSports 12Feb 2026:అహ్మదాబాద్: క్రికెట్ ప్రియులకు అసలైన టీ20 మజా అంటే ఏంటో బుధవారం రాత్రి జరిగిన పోరు చూపించింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఊహకందని మలుపులు తిరిగింది. ఒకే మ్యాచ్‌లో మూడు సార్లు స్కోర్లు సమమవ్వడం, విజేత ఎవరో తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి రావడం గమనార్హం. చివరికి ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా పోరాడి సరిగ్గా 187 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84 పరుగులు) వీరోచితంగా ఆడినప్పటికీ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది.
  • తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది.అనంతరం దక్షిణాఫ్రికా కూడా చివరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్ సిక్సర్ బాదడంతో సరిగ్గా 17 పరుగులే చేసింది.దీంతో ఫలితం తేలక మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
  • రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి, డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షంతో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు రాబట్టింది.24 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ తరపున గుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు.
    అయితే కేశవ్ మహరాజ్ వేసిన చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా, గుర్బాజ్ అవుట్ కావడంతో ఆఫ్ఘన్ 19 పరుగుల వద్దే ఆగిపోయింది.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana