
DSports 03 Dec:రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. నేడు (డిసెంబర్ 3, బుధవారం) రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న కేఎల్ రాహుల్ నాయకత్వంలోని భారత జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
