
DSports 03 Dec:ముంబై: భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌ల వివాహంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం, వదంతులపై స్మృతి కుటుంబం నుంచి స్పష్టత వచ్చింది. వీరి వివాహం డిసెంబర్ 7న జరగబోతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్మృతి మంధాన సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టిపారేశారు.
ప్రస్తుతానికి ఇరు కుటుంబాలు పెళ్లికి సంబంధించిన కొత్త తేదీని ఖరారు చేయలేదని, స్మృతి తండ్రి ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
