D Spiritual: Feb 13: నడక దారుల్లో వస్తున్న భక్తులు

శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే నల్లమల్ల నడక మార్గమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. “ఓం నమఃశివాయ” నినాదాలతో జనసంద్రం శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధికి తండోపతండాలుగా తరలివస్తోంది. భక్తి పారవశ్యంతో అలరారుతున్న క్షేత్రంలో స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు పుష్పాలతో సుందరంగా అలంకరించబడ్డాయి. సాయంత్రం అయ్యేసరికి ఆలయం విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. నల్లమల్ల అడవుల నడకదారులన్నీ శివనామస్మరణతో ప్రజ్వరిల్లుతున్నాయి. ఇలకైలాసంగా పేరుగాంచిన శ్రీగిరి క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. “హర హర మహాదేవ శంభో శంకర” నినాదాలతో భక్తులు ఉత్సాహంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు.

నడక మార్గాల్లో సేవా కార్యక్రమాలు

నడకదారులన్నీ భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి. మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతుండగా, దేవస్థానం ఆధ్వర్యంలో మంచినీరు తదితర అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మండుటెండను లెక్కచేయకుండా వెంకటాపురం నుండి నట్టడవి మార్గం గుండా మల్లన్నను స్మరించుకుంటూ భక్తులు కైలాసద్వారం చేరుకుంటున్నారు. అక్కడ భక్తుల విశ్రాంతి కోసం చలువ పందిళ్లు, అన్నప్రసాద వితరణ, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్సులు వంటి ఏర్పాట్లు చేశారు.

బ్రహ్మోత్సవాల వైభవం, పుణ్యస్నానాలు

చిన్నా పెద్దా, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా భక్తులు మల్లన్న దర్శన భాగ్యం కోసం తరలివస్తున్నారు. “స్వామీ, మా కుటుంబాన్ని చల్లగా దీవించు” అంటూ ప్రార్థిస్తూ స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. దేవస్థానం భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి సాఫీగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టింది. క్షేత్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోతోంది. శివమాలలో వచ్చిన స్వాములు శివదీక్ష శిబిరాలకు చేరుకుని ఇరుముడి సమర్పిస్తున్నారు. వారికి సమయానుసారంగా దర్శనం కల్పిస్తున్నారు. మరికొందరు భక్తులు పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి తమ మ్రొక్కులు తీర్చుకుంటున్నారు. దర్శన క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana