D Spiritual: Feb 2: ఇంటి ఆవరణలో వేపచెట్టును పవిత్రతకు, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఇది ఔషధ గుణాలతో పాటు దైవ అనుగ్రహాన్ని అందిస్తుందని నమ్మకం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వేపచెట్టును సరైన దిశలో నాటినప్పుడే శుభఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు.

వేప చెట్టు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. అలాగే దక్షిణం లేదా నైరుతి దిశల్లో నాటడం వాస్తు దోషానికి కారణమవుతుందని విశ్వాసం. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేప చెట్టు నీడ నేరుగా ఇంటిపై పడితే ఛాయ దోషం ఏర్పడి అనారోగ్యాలు, కుటుంబ కలహాలు పెరుగుతాయని భావిస్తారు.

అందుకే తూర్పు దిశలో, ఇంటి పునాదిని వేర్లు తాకని విధంగా వేపచెట్టును నాటితే శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఈ విధంగా నాటిన వేపచెట్టు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఇంటికి శాంతి, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని నమ్మకం.

ప్రకృతి దేవతగా భావించే వేపచెట్టును భక్తితో పూజిస్తూ, వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంపద నిలుస్తాయని పండితులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana