
DSports29Oct:కాన్బెర్రా, అక్టోబర్ 29: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా, నేడు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో తొలి T20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 1:45 PMకి ప్రారంభం కానుంది.
సూర్య కెప్టెన్సీపై అంచనాలు:
ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా 2-1 తేడాతో సొంతం చేసుకున్నప్పటికీ, T20 ఫార్మాట్లో భారత్‌ను ఓడించడం అంత సులువు కాదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. సూర్య కెప్టెన్సీలో భారత్ 80 శాతానికి పైగా T20 మ్యాచ్‌లు గెలుపొందడం అతని నాయకత్వ పటిమకు నిదర్శనం.
కాన్బెర్రాలో రెండో పోరు
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మనుకా ఓవల్‌లో జరుగుతోంది.
T20 ఫార్మాట్లో ఈ రెండు జట్లు ఈ వేదికపై తలపడటం ఇది రెండోసారి.
చివరిసారిగా ఈ జట్లు 2020లో ఇక్కడ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి విజయం సాధించింది.
కాన్బెర్రాలో ప్రస్తుతం చల్లని వాతావరణం నెలకొన్నప్పటికీ, ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం.
