DSports:29 OCT:ముంబై, అక్టోబర్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి తన ప్రతిభతో చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ అతనికి ఈ ఘనత తెచ్చిపెట్టింది. సిరీస్‌లో మూడో వన్డేలో కోహ్లీతో కలిసి రోహిత్ దూకుడు ప్రదర్శన చూపించాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచాడు.

781 రేటింగ్ పాయింట్లతో రోహిత్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 725 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

38 ఏళ్ల వయసులో తొలిసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన రోహిత్, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ సిరీస్‌లో ఆయన 101 సగటుతో మొత్తం 202 పరుగులు సాధించాడు.

వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలవడం భారత క్రికెట్‌కు సానుకూల సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana