
DSports 20Feb 2026:ముంబై/కొలంబో: ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ సృష్టించి, టీ20 ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేక (0, 0, 0) పెవిలియన్ చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్, అభిషేక్ తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని సూచించారు.
- స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గావస్కర్, అభిషేక్ వైఫల్యాలకు కారణం కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదని, మానసిక ఒత్తిడి కూడా అని అభిప్రాయపడ్డారు.”అభిషేక్ శర్మ చాలా ప్రతిభ ఉన్న ఆటగాడు. కానీ, అతనిపై ఉన్న అంచనాలే అతన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. విధ్వంసకర ఓపెనర్ అని, 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాలని తనకు తాను పెట్టుకున్న నిబంధనల వల్లే అతను ఇబ్బంది పడుతున్నాడు. బలవంతంగా షాట్లు ఆడాలని ప్రయత్నించడం వల్లే వికెట్ పారేసుకుంటున్నాడు” అని గావస్కర్ పేర్కొన్నారు.
