D News: Oct 28: భద్రాద్రి కొత్తగూడెం: తుఫాన్ ప్రభావంతో వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్న అర్నబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని సమాచారం. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ అంకిత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం రోజున పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రజలకు అధికారుల కీలక సూచనలు

తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. భారీ వర్షాలు పడే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు, చిన్నపిల్లలు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనిస్తూ, అధికారుల సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana