
DSports Dec19 2025 :సిడ్నీ: మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ, బుల్లెట్ వేగంతో బంతులు విసిరే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ వెనుక ఒక కన్నీటి గాథ ఉంది. తాను పుట్టుకతోనే ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (Chronic Kidney Disease – CKD) అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
గ్రీన్ తల్లి 19 వారాల గర్భవతిగా ఉన్న సమయంలోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈ సమస్య బయటపడింది. ఆ సమయంలో వైద్యులు గ్రీన్ తండ్రి గ్యారీతో మాట్లాడుతూ, “మీ అబ్బాయి 12 ఏళ్లకు మించి బతకడం కష్టం” అని తేల్చి చెప్పారు. కిడ్నీలు సాధారణ వ్యక్తుల మాదిరిగా రక్తాన్ని శుద్ధి చేయలేవని, పరిస్థితి చాలా విషమంగా ఉందని వారు హెచ్చరించారు.
