
DSports Dec19 2025 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2026 మెగా టోర్నీ కోసం భారీ బహుమతి మొత్తాన్ని ఫిఫా (FIFA) ప్రకటించింది. అమెరికా, మెక్సికో, కెనడా వేదికలుగా జరగనున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 451 కోట్లు) నగదు బహుమతి దక్కనుంది.
2026 ప్రపంచకప్ కోసం ఫిఫా మొత్తం 655 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,912 కోట్లు) పూల్‌ను కేటాయించింది. ఇది 2022 ఖతార్ వరల్డ్ కప్ (440 మిలియన్ డాలర్లు) కంటే దాదాపు 50 శాతం ఎక్కువ.గతంలో అర్జెంటీనా (2022 విజేత) 42 మిలియన్ డాలర్లు అందుకోగా, ఈసారి విజేతకు అదనంగా మరో 8 మిలియన్ డాలర్లు పెంచి మొత్తాన్ని 50 మిలియన్ డాలర్లకు చేర్చారు.రన్నరప్‌కు ఎంత?: ఫైనల్లో ఓడిపోయిన రన్నరప్ జట్టుకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 297 కోట్లు) లభిస్తాయి.మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 261 కోట్లు, నాలుగో స్థానానికి రూ. 243 కోట్లు అందజేయనున్నారు.
