DET:NOV 21:
కొత్త మార్గంలో దృశ్యం 3!
దృశ్యం ఫ్రాంచైజీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మొదటి రెండు భాగాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు దృశ్యం 3 వస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే, దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం ఈసారి కథనాన్ని పాత విధానంలో కాకుండా కొత్త పంథాలో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

జార్జ్‌కుట్టి కుటుంబంపైనే ప్రధాన దృష్టి:
జీతూ జోసెఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దృశ్యం 3 స్క్రిప్ట్ గురించి ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు.నేను దృశ్యం 2 కంటే మంచి స్క్రిప్ట్ రాయాలని కావాలని ప్రయత్నించడం లేదు. నా దృష్టి కేవలం జార్జ్‌కుట్టి మరియు అతని కుటుంబంపైనే ఉంది. పార్ట్ 2 తర్వాత ఆరేడు సంవత్సరాలలో వారి జీవితాల్లో ఏమి జరిగి ఉండవచ్చు అనే దానిపైనే నేను దృష్టి పెట్టాను,అని ఆయన వివరించారు. ఈ ఫ్రాంచైజీని తాను సహజసిద్ధమైన పద్ధతిలోనే ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.

కాలంలో ముందుకు సాగే కథనం:

దృశ్యం 3 కథనం సమయం పరంగా ముందుకు సాగుతుందని దర్శకుడు సూచించారు. మొదటి భాగం ఒక కుటుంబం అనుభవించిన సంఘటన గురించి ఉంటే రెండో భాగంలో ఆరేళ్ల తర్వాత జార్జ్‌కుట్టి కుటుంబం ఎలా ఉంది వారిలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది చూపించాం. ఇప్పుడు, మూడో భాగంలో మేం మరో మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలు కాలంలో ముందుకు వెళ్తున్నాం అని జీతూ జోసెఫ్ తెలిపారు. అంటే, పార్ట్ 2 లో సాక్ష్యాన్ని తుడిచివేసిన తర్వాత జార్జ్‌కుట్టి మరియు అతని కుటుంబం జీవితాలు ఎలా మారాయనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

పాత్రల్లో సహజమైన పరిణామం:
కుటుంబంలోని ప్రతి పాత్రలో వచ్చిన సహజమైన పరిణామాన్ని ఈ భాగంలో చూడవచ్చు అని జీతూ జోసెఫ్ అన్నారు.రాణి మరియు పిల్లలు అంజు అను పాత్రలు కూడా కాలక్రమేణా మారుతూ వచ్చాయి. సంఘటన జరిగినప్పుడు చిన్నపిల్లగా ఉన్న అను కూడా ఇప్పుడు పెరిగింది. వారి చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతోంది అని ఆయన పేర్కొన్నారు. ఈ కథనం పూర్తిగా జార్జ్‌కుట్టి ప్రపంచంలో సహజంగా ఏం జరిగిందో దాని ఆధారంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.