మీరు తరచూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఆన్‌లైన్ ఈ-కామర్స్ ఫ్లాట్ఫామ్స్‌లలో నకిలీ ప్రకటనలు, డిస్కౌంట్లు లాంటివి ఇకపై ఉండవ్. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తుంది. కస్టమర్లకు రక్షణ కలిగించేలా ఇవి ఉన్నాయి.

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ఊరట కలిగించే విధంగా కేంద్ర కొత్త రూల్స్ తీసుకురానుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కస్టమర్లకు తెలియకుండానే అనేక మోసాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫామ్స్ కొన్ని ట్రిక్స్ ఉపయోగించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టి వినియోగదారులకు రక్షణగా నిలిచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు, నకిలీ ఆఫర్లు, డిస్కౌంట్ల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కఠిన రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి నకిలీ ఆఫర్లు, కస్టమర్లను తప్పు పట్టించే ప్రకటనకు చెక్ పడనుంది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణను కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

జనవరి 1,2027 నుంచి కొత్త ఆన్‌లైన్ షాపింగ్ నియమాలు అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. డార్క్ ప్యాటర్న్, స్పాన్సర్డ్ లిస్టింగ్స్, రీఫండ్, నకిలీ డిస్కౌంట్లు వంటివి ఇకపై కుదరవు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ప్రొడక్ట్స్ రేట్లను పెంచి వాటిపై డిస్కౌంట్ అంటూ కస్టమర్లను మోసగిస్తున్నాయి. నిజంగా తక్కువ ధరకే వస్తుందనే ఆశతో చాలామంది కొంటున్నారు. ఇక నుంచి ఇలాంటి మోసాలు జరగవు. అలాగే స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ కొనేలా కస్టమర్లను ప్రభావితం చేస్తున్నారు. పెయిడ్ ప్రమోషన్ వస్తువులను టాప్‌లో చూపిస్తున్నాయి. అలాగే డార్న్ ప్యాటర్న్ ద్వారా మోసగిస్తున్నాయి. ఇలాంటివి ఇకపై ఉండవ్.

జనవరి 1 నుంచి కొత్త రూల్స్ ఇవే..

-జనవరి 1 నుంచి ఈ కామర్స్ పోర్టల్స్ తగ్గింపు ధరతో పాటు మునుపటి ధరలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. గత 30 రోజుల్లో వసూలు చేసిన అత్యల్ప ధరలను మాత్రమే ప్రదర్శించాలి. దీని వల్ల నిజంగానే డిస్కౌంట్ వచ్చిందా.. లేదా అనేది వినియోగదారులకు తెలుస్తుంది

-ఈ-కామర్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఏదైనా వస్తువు గురించి సెర్చ్ చేయగానే స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ అగ్రస్థానంలో కనిపిస్తున్నాయి. ఇకపై వీటిని స్పాన్సర్డ్ లేబుల్‌తో వినియోగదారులకు తెలిసేలా స్పష్టంగా పేర్కొనాలి. పెయిడ్ ప్రమోషన్ వస్తువులను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది

-రీఫండ్, పాడైన వస్తువులు, ఆర్డర్ క్యాన్సిలేషన్లకకు సంబంధించి తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక నుంచి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌తో కంపెనీలు అనుసంధానం కావాలి. దీని వల్ల వినియోగదారులు తమ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించుకోవచ్చు

-ఉత్పత్తి గడవు తేదీలు, బెస్ట్ బిఫోర్ డేట్స్, రిటర్న్, రీఫండ్ పాలసీలు, డెలివరీ టైమ్, వ్యారెంటీ, గ్యారెంటీ వివరాలను స్పష్టంగా పొందుపర్చాలి

-ఇక డార్క్ ప్యాటర్న్‌లను దూరంగా ఉండాలి. తప్పుదోవ పట్టించే డిజైన్లు, సబ్‌స్క్రిప్షన్ల పద్దతులను ఉపయోగించకూదు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి

-ఈ-కామర్స్ వెబ్ సైట్లు, యాప్‌లు తమ సిస్టమ్‌లకు సంబంధించి వార్షిక ఆడిట్‌లు నిర్వహించాలి

-డార్న్ ప్యాటర్న్‌ గైడ్‌లైన్స్ పాటిస్తున్నట్లు ధృవీకరిస్తున్నట్లు ఒక సర్టిఫికేట్‌ను పోర్టల్‌లో ప్రదర్శించాలి

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *