హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా.. EICMA 2026లో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ UBXను ఆవిష్కరించింది. సరికొత్త డిజైన్‌తో వచ్చిన ఈ బైక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి హీరో అడుగుపెడుతున్నట్లు సూచిస్తోంది.

స్పోర్టీ డిజైన్.. ఆధునిక ఫీచర్లు

Hero Vida y Zero revolucionan la moto eléctrica con una gama para todos los estilos

hibridosyelectricos.com

UBX బైక్ సూపర్‌మోటో స్టైల్‌లో రూపొందించారు. ఇందులో LED లైటింగ్, TFT డిస్‌ప్లే, సింగిల్ పీస్ సీటు, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన స్వింగ్‌ఆర్మ్ డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది.

రేంజ్, బ్యాటరీ వివరాలు వెల్లడించలేదు

ఈ బైక్ బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, టాప్ స్పీడ్, ఛార్జింగ్ సమయం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే వచ్చే రేంజ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఇది కాన్సెప్ట్ దశలోనే ఉంది. కాబట్టి ప్రచారంలో ఉన్న రేంజ్ అంచనాలను అధికారిక వివరాలుగా భావించకూడదు.

2027లో ఎలక్ట్రిక్ బైక్ రాక?

హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2027లో తీసుకురావాలని గతంలో ప్రకటించింది. అయితే UBX ఉత్పత్తి మోడల్ విడుదల తేదీ, ధరపై ఇంకా స్పష్టత లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *