Dorothy: Rana Daggubati Presents Karthik Subbaraj’s Dorothy to Release in Telugu on October 2

D News : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన విభిన్న చిత్రం ‘డోరతీ’ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆస్కార్ అవార్డు విజేత గునీత్ మోంగా నిర్మించారు.

అక్టోబర్ 2న తెలుగు రిలీజ్

రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

1990ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథలో సామాజిక పక్షపాతాలు, లింగ సమానత్వం, LGBTQIA+ అంశాలను కథలో భాగంగా చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఇక లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో ప్రత్యేకత. తమిళంలో విడుదలైన ‘డోరతీ’ ఇప్పుడు తెలుగులో ఎలాంటి స్పందన అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash