
D Educt: Sept 26: ఆర్ఆర్బీ నుంచి 3,477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,477 ఖాళీల భర్తీకి ఇప్పటికే సంక్షిప్త ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులను నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు
గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించిన వివిధ పోస్టుల భర్తీకి త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్బీ వెల్లడించింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 8న ప్రారంభమై నవంబర్ 6 వరకు కొనసాగనుంది.
ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు
ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ తదితర గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
