
DET:NOV 18:
చలికాలంలో షుగర్ నియంత్రణ: తప్పనిసరిగా పాటించాల్సినవి..!
సాధారణంగానే డయాబెటిస్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి.అలాంటిది ఈ చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ సీజన్‌లో షుగర్ పెరగకుండా ఉండాలంటే..!
చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఉదయం లేవగానే చేయవలసిన పని:
ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తాగాలి.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి:
బ్రేక్ ఫాస్ట్‌లో తప్పనిసరిగా ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి,తద్వారా రక్తంలోకి చక్కెర విడుదల నెమ్మదిగా జరుగుతుంది.
పండ్లు తీసుకునేటప్పుడు పాటించవలసిన నియమం:
అంతేకాదు చలికాలంలో పండు ఎక్కువ మోతాదులో దొరుకుతుంది.అయితే,వీటిని పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే కొన్ని పండ్లలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి.
