Chiranjeevi to Enter Multiplex Business with Asian Cinemas?

D News: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమా నిర్మాణంతో పాటు ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు టాక్.

ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచ స్థాయి భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జర్మనీలోని ట్రాంపలాస్ట్ లియోన్‌బెర్గ్ స్క్రీన్ రికార్డును మించే స్థాయిలో దీనిని రూపొందించనున్నట్లు సమాచారం. అయితే స్క్రీన్ పరిమాణం, సౌండ్, ప్రొజెక్షన్ టెక్నాలజీపై ఇంకా అధికారిక వివరాలు వెల్లడికాలేదు.

ఏషియన్ సినిమాస్ ఇప్పటికే మహేష్ బాబుతో ఏఎంబీ సినిమాస్, అల్లు అర్జున్‌తో ఏఏఏ సినిమాస్, విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్ వంటి ప్రీమియం మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తోంది. ఇప్పుడు చిరంజీవితోనూ ఇలాంటి భారీ ప్రాజెక్ట్ రానుందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది.

ఈ మల్టీప్లెక్స్‌కు ‘ఏషియన్ చిరంజీవి సినిమాస్’ లేదా ‘ఏషియన్ మెగాస్టార్ సినిమాస్’ పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana