
D News: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండనున్నట్లు సమాచారం.
అక్టోబర్ నుంచి ‘బ్లడీ రోమియో’
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 2027 సమ్మర్‌లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్.
వెంకీ అట్లూరి, సిబి చక్రవర్తితో సినిమాలు
ఇక దర్శకుడు వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.
అదే సమయంలో తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితోనూ నాని సినిమా చర్చల్లో ఉంది. ఆయన ప్రస్తుత సినిమా పూర్తయిన తర్వాత నానితో ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇలా ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని లైనప్‌లో ‘బ్లడీ రోమియో’, వెంకీ అట్లూరి సినిమా, సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.
