
మేడ్చల్లోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్ రెడ్డిపై 8 నుంచి 10 మంది విద్యార్థులు దాడి చేసినట్లు సమాచారం.
కర్రలు, భోజనం చేసే ప్లేట్లతో అభిషేక్ రెడ్డిని కొట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బూట్లతో అతడి ముఖంపై తొక్కినట్లు సమాచారం. దాడి తీవ్రతకు అభిషేక్ రెడ్డి మెట్లపై నుంచి కింద పడిపోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే అభిషేక్ రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనంతరం బాధితుడిని కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
