DET:DEC 04:
క్లిక్‌బైట్ కల్చర్ లో నిజం తెలుసుకోవడం ముఖ్యం రకుల్:
బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీ ఆయన తండ్రి వాషూ భగ్నానీ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్.ఇటీవల భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా జాకీ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడం. ఈ సినిమా దెబ్బతో సంస్థ మూతపడుతోందని ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేకపోతున్నారని ఆర్థికంగా జాకీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అనేక కథనాలు ప్రచారమయ్యాయి.అయితే ఈ వార్తలపై జాకీ భార్య ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించారు. ఈ మధ్య క్లిక్‌బైట్ కల్చర్ బాగా పెరిగిపోయిందని, మీడియాలో వచ్చే వార్తల్లో చాలా వరకు అతిశయోక్తులు ఉంటాయని ఆమె అన్నారు. నేను కూడా ఈ పరిశ్రమలో ఉన్నాను కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది నాకు తెలుసు అని రకుల్ అన్నారు.

నిజమే ఆర్థిక నష్టాలు వచ్చాయి!

ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని రకుల్ అంగీకరించారు. నిజమే ఒకటి రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. అది కుటుంబానికి ముఖ్యంగా జాకీకి చాలా కష్టకాలం అని ఆమె చెప్పారు. కొన్ని విషయాలు తప్పుగా ప్రచారం అయ్యాయని కానీ నష్టాలు మాత్రం వచ్చాయని స్పష్టం చేశారు. అయితే ఆ నష్టం ఎంత అనేది ఆమె చెప్పలేదు.

పరిశ్రమలో ఇవన్నీ సహజం రకుల్
:
సినిమా పరిశ్రమలో ఇలాంటి ఒడిదుడుకులు సర్వసాధారణమని రాకుల్ అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మాతలు కూడా ఇలాంటి దశలను చూశారని అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ నటుడు కూడా ఒక దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. ఇదంతా ఒక ఫేజ్ మాత్రమే అని ఈ సమస్యల నుంచి బయటపడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కంపెనీ మూతపడట్లేదు స్పష్టత
:
కొన్ని మీడియా సంస్థలు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మూతపడుతోందని రాశాయి. ఈ వార్తలను రాకుల్ ఖండించారు. ఎలాంటి కంపెనీ మూతపడటం లేదు. నేను అసలు వార్తలు చదవను కాబట్టి నాకు వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నిజం ఏమిటో నాకు మొదటి నుంచీ తెలుసు అని రకుల్ ప్రీత్ సింగ్ గట్టిగా చెప్పారు. సంచలనాత్మక వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పరిశ్రమలో ఉన్నప్పుడు ఇలాంటి గోలను దూరం పెట్టడం నేర్చుకోవాలని ఆమె తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana