DET:DEC 04:
షిర్డీ సాయిబాబా నటుడికి ఆర్థిక సహాయం:
బాలీవుడ్‌లో షిర్డీ కే సాయిబాబా 1977 చిత్రంలో సాయిబాబా పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు సుధీర్ దాల్వి 86 గారు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన సెప్సిస్ అనే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌కు చికిత్స తీసుకుంటున్నారు.దీనివల్ల ఆయనకు చాలా ఆర్థిక కష్టాలు ఏర్పడ్డాయి.ఆసుపత్రి బిల్లుల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు అయిందని మొత్తం చికిత్సకు సుమారు రూ.15 లక్షలు అవసరమని తెలిసింది.ఈ నేపథ్యంలో దాల్వి కుటుంబం సినీ ప్రముఖులను అభిమానులను ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించింది.

కోర్టు అనుమతితో ట్రస్ట్ నిర్ణయం:
నటుడు సుధీర్ దాల్వి గారి పరిస్థితిని మరియు ఆయన ఆర్థిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.అయితే ట్రస్ట్ తరపున డబ్బు ఖర్చు చేయాలంటే బాంబే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.దీని కోసం ట్రస్ట్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.సాయిబాబా పాత్రను పోషించిన నటుడిగా ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపును అలాగే ట్రస్ట్ చట్టంలోని మానవ సంక్షేమం కోసం మంచి పనులను ప్రోత్సహించడం అనే నిబంధనను పరిశీలించిన న్యాయమూర్తులు దాల్వి గారికి రూ.11 లక్షలు ఆర్థిక సహాయం అందించడానికి అనుమతినిచ్చారు.

నటుడి పాత్రను గుర్తించిన న్యాయస్థానం:
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు నటుడు పోషించిన పాత్ర ప్రాముఖ్యతను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.సాయిబాబా పాత్ర ద్వారా ప్రజల విశ్వాసంలో ఆయనకు ఉన్న స్థానాన్ని పరిగణనలోకి తీసుకుని ఇటువంటి సహాయం అందించడం సాయిబాబా జీవితం యొక్క ఉద్దేశానికి చేసిన పనులకు అనుగుణంగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.ప్రస్తుతం సుధీర్ దాల్వి గారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఇద్దరు కేర్‌టేకర్స్ మరియు ఫిజియోథెరపిస్ట్ సహాయంతో చికిత్స తీసుకుంటున్నారు.ఆయన పూర్తి కోలుకోవడానికి ఒక సంవత్సరం వరకు పట్టవచ్చని డాక్టర్లు తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana