
DSports Dec30 2025:ఈ టోర్నమెంట్లో తొమ్మిదో రౌండ్ సందర్భంగా అర్జున్ ఇరిగైసి, మాగ్నస్ కార్ల్సన్ తలపడ్డారు. నల్లటి పావులతో ఆడిన అర్జున్, ప్రపంచ ఛాంపియన్‌పై పైచేయి సాధించి విజేతగా నిలిచారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న కార్ల్సన్, నిర్ణీత సమయం ముగియడంతో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.అర్జున్ చేతిలో ఓటమి పాలవడంతో కార్ల్సన్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కోపంతో చెస్ బోర్డు టేబుల్‌ను బలంగా చరుస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ర్ల్సన్పై గెలుపుతో పాటు, అర్జున్ వరుసగా విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పదో రౌండ్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ను కూడా ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.
