
DSports Dec30 2025: సాధారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేదా శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజాల పేర్లు వస్తాయని అందరూ భావిస్తారు. కానీ అశ్విన్ మాత్రం యువ సంచలనం అభిషేక్ శర్మ ను ఈ ఏడాది ఉత్తమ బ్యాటర్‌గా ఎంచుకున్నారు.
2025లో అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పవర్ ప్లేలో అతను బ్యాటింగ్ చేసే తీరు, దాదాపు 193 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించడం అశ్విన్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అభిషేక్‌ను కేవలం టీ20లకే పరిమితం చేయకుండా వన్డేలు, టెస్టుల్లో (రెడ్ బాల్ క్రికెట్) కూడా పరీక్షించాలని అశ్విన్ సెలెక్టర్లకు సూచించారు.
