
D Spiritual: Oct 28: నిత్య దీపారాధన ప్రాముఖ్యత
సాధారణంగా హిందువులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నిత్యం దీపారాధన చేసి భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటారు. ఇలా నిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉండి, మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సకల సంపదలను కలిగిస్తారని భావిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు ఎంతోమంది పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.
పగిలిన విగ్రహాలు మరియు పాత ఫోటోలపై నిర్లక్ష్యం
ఇకపోతే చాలామంది ఇళ్లల్లో కాస్త పగిలిపోయిన విగ్రహాలు, ఫోటోలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా పూజలు చేస్తుంటారు. ఈ విధంగా ఇంట్లో పగిలిపోయిన ఫోటోలు లేదా విరిగిపోయిన విగ్రహాలు, అలాగే పాతబడి బూజు పట్టిన ఫోటోలు ఉన్నప్పటికీ అలాగే పూజ చేయడం పరమ దరిద్రం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
పగిలిన విగ్రహాలను తొలగించే ప్రాముఖ్యత
ఏ ఇంట్లో అయితే పగిలిపోయి బూజు పట్టిన ఫోటోలు, విగ్రహాలు ఉంటాయో వెంటనే వాటిని తొలగించడం శుభప్రదం. అదేవిధంగా దేవుని గదిలో ఎక్కువ ఫోటోలు లేకుండా, ఎత్తైన విగ్రహాలు లేకుండా చూసుకోవాలి. ఇలా పగిలిపోయిన ఫోటోలు కనుక ఉంటే వెంటనే వాటిని తీసి పారుతున్నటువంటి నీటిలో నిమజ్జనం చేయాలి.
నూతన పూజా విధానం
ఇలా వాటిని నిమజ్జనం చేసిన అనంతరం వాటి స్థానంలో కొత్త ఫోటోలను తీసుకొని పూజించాలి. ఈ విధంగా పగిలిపోయిన లేదా బూజు పట్టిన ఫోటోలకు పూజ చేయడం వల్ల మనం చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదు.
ప్రతికూల ఫలితాలు మరియు పరిహారం
మన పూజ వ్యర్థం అవడమే కాకుండా, మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటివి జరుగుతుంటాయి. అందుకే పగిలిపోయినటువంటి ఫోటోలను లేదా విగ్రహాలను పారుతున్న నీటిలో నిమజ్జనం చేయడం ఎంతో ముఖ్యం.
