D Spiritual: Feb 13: మహా శివరాత్రి విశిష్టత

మహా శివరాత్రి అత్యంత పవిత్రమైన దినాలలో ఒకటి. ఈ రోజున శివభక్తులు పరమశివుడిని మారేడు దళాలతో పూజిస్తూ, మహాభిషేకాలు నిర్వహించి శివనామస్మరణ చేస్తారు. ముఖ్యంగా ఉపవాసం ఉండి జాగరణ చేయడం ఈ దినానికి ప్రత్యేకతగా భావిస్తారు.

శివరాత్రి రోజు ఆచారాలు

ఈ రోజున చాలా మంది భక్తులు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివపూజ చేస్తారు. అనంతరం తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమశివుడిని దర్శించి పూజలు నిర్వహిస్తారు. అలాగే, ఈ రోజు ఆలయానికి వెళ్లేటప్పుడు ఒక ప్రత్యేకమైన వస్తువును తీసుకువస్తే జన్మధన్యం అవుతుందని భక్తుల విశ్వాసం ఉంది.

ఫిబ్రవరి 15న మహా శివరాత్రి

మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేసే భక్తులకు శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అభిషేకం అనంతరం కొన్ని వస్తువులను ఇంటికి తీసుకువస్తే దారిద్ర్యం దూరమై ఐశ్వర్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

బిల్వపత్రం ప్రాముఖ్యత

అభిషేకం తర్వాత శివుడికి సమర్పించిన బిల్వపత్రాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదమని చెబుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ బిల్వపత్రాన్ని బీరువాలో లేదా పర్సులో ఉంచితే అప్పుల సమస్యలు తగ్గి ఆర్థికంగా కలిసి వస్తుందని విశ్వాసం.

పార్వతీ దేవి పూజ ఫలితం

శివాలయంలో పూజ సమయంలో పార్వతీ దేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరాన్ని ఇంటికి తీసుకువచ్చి ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగి దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందని, ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం.

అభిషేక జలంతో శుభఫలితాలు

శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకువచ్చి ఇంటిలో చల్లడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయని అంటారు. దీనివల్ల ఇంటిలో ఉన్న సమస్యలు తొలగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని భక్తులు భావిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana