D Spiritual: Oct 28: కార్తిక పౌర్ణమి 2025 తేదీ మరియు సమయం:
హిందువులకు పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో పరమశివుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈరోజున ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతాయి. పౌర్ణమి నాడు చేసే నదీ స్నానానికి, దానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో నదీ స్నానం చేయాలి, పూజా విధానం ఏంటో తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30కి మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, నవంబర్ 5నే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజున నదీ స్నానం చేసి, దీపాలు వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి.

నదీ స్నానం ఎప్పుడు చేయాలి?
కార్తీక పౌర్ణమి పర్వదినాన నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44 వరకు చేస్తే మంచిది. శివుడిని ఆరాధించడానికి ఉదయం 7:58 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు శుభప్రదంగా ఉంటుంది. సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు ఉంటుంది.

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత:
కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుడిని పూజించడంతోపాటు 365 వత్తులు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఏడాదిలో ఎప్పుడూ దీపం పెట్టనివారు ఈరోజు దీపారాధన చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం లభించడంతోపాటు నిండు నూరేళ్లు అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. పౌర్ణమి నాడు ఉసిరికాయలో నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana