D Spiritual: Oct 13: సోమనాథుడు: శివుడిని సోమవారం రోజున ఎందుకు పూజిస్తారు?

హిందూ ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనను నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను సైతం అనుగ్రహించి, వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు ఈ పరమేశ్వరుడు. అయితే, ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. ఇలా పూజించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ‘సోమ’ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు, శివుడికి మధ్య గల సంబంధం గురించి పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

దక్షుడి శాపం, చంద్రుడి క్షీణత

దక్ష రాజు తన 27 మంది దత్త పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. అయితే, చంద్రుడికి వీరిలో రోహిణి అంటేనే అమితమైన ఇష్టం. చంద్రుడు ఆమెతో ఎక్కువగా గడుపుతూ, మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తుంటాడు. చంద్రుడి ప్రవర్తన పట్ల ఆగ్రహించిన రోహిణి సోదరీమణులు తమ తండ్రి దక్ష రాజుకు ఫిర్యాదు చేస్తారు. దక్షుడు పలుమార్లు చంద్రుడిని బతిమాలినా, హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో, కోపోద్రేక్తుడైన దక్ష రాజు.. చంద్రుడిని శపిస్తాడు. ఫలితంగా చంద్రుడు రోజురోజుకు తన సౌందర్యాన్ని, మెరుపును కోల్పోవడమే కాకుండా, తన పరిమాణంలోనూ కుంచించుకుపోవడం మొదలుపెడతాడు.

శివుడి శరణు, పౌర్ణమి-అమావాస్యల రహస్యం

తనకు ఈ ఆపద దక్ష శాపం వల్ల కలిగిందని గ్రహించిన చంద్రుడు.. సహాయం కోసం మొదట బ్రహ్మదేవుడిని శరణుగోరగా, ఈ సమస్యకు పరిష్కారమార్గం శివుడొక్కడే చూపించగలడని విధాత సూచిస్తాడు. అప్పుడు చంద్రుడు పరమ భక్తితో శివుడిని ప్రార్థించి, త్రినేత్రుడిని సంపన్నం చేసుకుంటాడు. అయితే, అప్పటికే దక్ష శాపం తీవ్ర ప్రభావం చూపించడంతో, శివుడు ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించలేకపోతాడు.

అందువల్ల, పదిహేను రోజులకోసారి చంద్రుడు పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ, మిగిలిన 15 రోజులు కుదించుకుపోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు. ఈ కారణంగానే మనకు పౌర్ణమి, అమావాస్యలు ఏర్పడుతున్నాయి.

సోమనాథుడు, చంద్రశేఖరుడు

దక్ష శాపం నుంచి చంద్రుడిని కాపాడిన కారణంగానే శివుడిని సోమనాథుడని పిలుస్తారు. అంతేకాకుండా, నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడని అని కూడా పిలుస్తుంటారు. ఈ కారణంగానే చంద్రుడిని సూచించే సోమవారం రోజున మహేశ్వరుడిని ప్రజలు పూజించడం మొదలుపెట్టారు. ఆ రోజు త్రినేత్రుడిని భక్తితో సేవిస్తే, సమస్యల నుంచి మహాదేవుడు తమను రక్షిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana