Gold and Silver Prices Today: Gold Rates Drop by Rs. 2,560 on Dhantrayodashi, Check Latest Rates in AP and Telangana
Asia, Arabia, Dubai Emirate, Dubai, Deira, Jewelry store in Dubai’s Gold Souk

ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. శుక్రవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,560, 22 క్యారెట్ల బంగారంపై రూ.2,350 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర ఔన్సుకు 40 డాలర్లు తగ్గి 4,046 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర కూడా ఒక్కసారిగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో శుక్రవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,610గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,650గా ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,350, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,400 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,05,000గా నమోదైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక: పైన పేర్కొన్న ధరలు శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనవి మాత్రమే. బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో పలుమార్లు మారే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపుల్లో ధరలను నిర్ధారించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *