
D Educt: Oct 27: తుపాను హెచ్చరికలతో ఎఫ్ఎంజీ ఇంటర్న్షిప్ కౌన్సెలింగ్ వాయిదా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ) ఆధ్వర్యంలో అక్టోబరు 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించాల్సిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) విద్యార్థుల ఇంటర్న్షిప్ కేటాయింపుల కౌన్సెలింగ్ వాయిదా పడింది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఎంసీ ఛైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిశోర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు అక్టోబరు 26న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
కౌన్సెలింగ్ నిర్వహించే తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఛైర్మన్ వెల్లడించారు. విద్యార్థులు కొత్త తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని సూచించారు.
